Flexes in Hyderabad : హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం… అమిత్ షా గారు తెలంగాణకు ఏమైనా ఇచ్చేది ఉందా?…ఏదైనా ప్రకటన చేస్తారా?

తెలంగాణ విమోచన దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ జరగనున్న ఈ వేడుకలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది.

  • Written By:
  • Updated On - September 17, 2022 / 12:35 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవ సంబురాలు అట్టహాసంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ జరగనున్న ఈ వేడుకలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా హాజరై మువ్వన్నెల జెండాను ఎగరవేయనున్నారు. శుక్రవారం రాత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం 8.30 కి సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు ఆయన చేరుకుంటారు. అమరవీరుల స్థూపానికి నివాళుర్పిస్తారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేస్తారు. కాగా అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లేక్సీలు ఏర్పాటయ్యాయి.

సెప్టెంబర్ 17 తెలంగాణకు ఏం ఇస్తావు…నిధులు ఏవి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గోవా లిబరేషర్ డేకు రూ. 300కోట్లు ఇచ్చింది కేంద్రం. మరి తెలంగాణ విమోచనం దినం అని చెప్పుకుంటే ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. అమిత్ గారు తెలంగాణకు ఏమైనా ఇచ్చేది ఉందా…ఏదైనా ప్రకటన చేస్తారా అంటూ పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.