రైలు ఇంజన్ కింద కూర్చొని 190 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి అలా..?

  • Written By:
  • Publish Date - June 8, 2022 / 09:20 AM IST

తాజాగా ఒక వ్యక్తి రైలు ఇంజిన్ చక్రాలపై కూర్చొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 190 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. వినడానికి షాకింగ్ గా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజమే. పాట్నా మీదుగా రాజ్ గిర్ నుంచి వస్తున్న బుద్ధపూర్ణిమ ఎక్స్ ప్రెస్ లో ఈ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. పాట్నా మీదుగా రాజ్ గిర్ నుంచి వస్తున్న బుద్ధపూర్ణిమ ఎక్స్ ప్రెస్ జర్నీ లో ఉండగా ఇంజన్ వద్ద కూర్చున్న డ్రైవర్ కి ఎవరో ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. దీనితో గయా జంక్షన్ లో రైలు ఆగిన తర్వాత రైడ్ ఇంజిన్ కింది భాగాన్ని పరిశీలించగా అక్కడ ఒక వ్యక్తి మంచి నీళ్ళు కావాలని అడుగుతున్నట్లు కనిపించడంతో వెంటనే టార్చ్ వేసి వేసి చూడగా ఇంజిన్ కింది భాగంలో ఒక వ్యక్తి కూర్చుని కనిపించాడు.

ఆ తర్వాత ప్రయాణికుల సహాయం తీసుకొని యువకుడి ని బయటకి తీశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే వెంటనే ఆ రైలు డ్రైవర్ ఈ విషయం రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో, రైల్వే అధికారులు ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని, రాజ్ గిర్ లో ఆ వ్యక్తి ట్రైన్ ఎక్కి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

కానీ అంత దూరం రైలు కింది భాగాన ఉంటూ ప్రయాణించడం అన్నది చాలా అరుదైన విషయం కాగా అతడు చాలా అదృష్టవంతుడు అని చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు.