Site icon HashtagU Telugu

Ranga Reddy: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు

jail

jail

Ranga Reddy: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి సప్లైయ్ అవుతూనే ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిది లోని తోల్కట్ట గ్రామ శివారులో ఒక షెడ్‌లో అక్రమంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న సౌరబ్ కుమార్ యాదవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని 580 గ్రాముల గంజాయితో 92 గంజాయి చాక్లెట్లు ఉన్నాయి.

అదే సమయంలో పాత నేరస్తుడైన ముజ్తాబా అలీ ఖాన్ (హైదరాబాద్ మరియు సైబరాబాద్ పరిధిలోని 10 కేసులలో సెల్ ఫోన్ల దొంగతనానికి పాల్పడిన నిందితుడు) గంజాయిని కొనటానికి 2 దొంగతనం చేసిన ఫోన్ల తో పట్టుబడటం జరిగింది. ఇతను డబ్బులకు బదులుగా ఫోన్ లను ఇచ్చి గంజాయి తీసుకోవడం విశేషం. విచారణలో నిందితుడు సౌరబ్ కుమార్ యాదవ్ బీహార్‌లోని మాధేపురా జిల్లా ఖోప్రియాటోన్
గ్రామానికి చెందిన సుబోధ్ సింగ్ గంజాయి చాక్లెట్‌లను కొనుగోలు చేసి మొయినాబాద్‌లోని తోల్‌కట్టా కు వచ్చి చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి  గంజాయిని అముతున్నాడు.