Site icon HashtagU Telugu

Visakhapatnam: ఎమ్మెల్యేలను మోసం చేసి.. రూ. 80 లక్షలతో ప్రియురాలికి ఇళ్లు కట్టించి!

Cyber Crime Imresizer

Cyber Crime Imresizer

ఈజీ మనీకి అలవాటు పడిన చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్య తరగతి ప్రజల నుంచి బడాబాబులకు వరకు నమ్మించి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఓ కేటుగాడు అందరికి భిన్నంగా ఎమ్మెల్యేలకే టోపీ పెట్టేశాడు. ఒకిరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా 80 మందిని మోసం చేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎమ్మెల్యేలను మోసం చేయడమే కాకుండా.. వాళ్ల నుంచి నుంచి వసూళ్ళు చేసిన డబ్బులతో ప్రియురాలికి ఇళ్లు కట్టించడం మరో ట్విస్ట్. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

ఏపీలోని విశాఖ పట్నంకు చెందిన ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడని సమాచారం. ‘సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా…’ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి డబ్బులు అడిగాడనే అభియోగంపై రాజస్థాన్ పోలీసులు పి.విష్ణుమూర్తి అలియాస్ సాగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గాజువాక పోలీసులు తెలిపారు. సీఎంవో నుంచి మాట్లాడుతున్నాను అంటూ.. అక్కడి ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి దాదాపు రూ.2.5కోట్లు  వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వసూలు చేసిన డబ్బుల్లో రూ.80 లక్షలతో  ప్రియురాలికి గాజువాకలో ఇల్లు కొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 2019లోనూ ఏపీలో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి రూ. 1.80 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Exit mobile version