Site icon HashtagU Telugu

Extramarital Affair: తల్లితో అఫైర్.. వ్యక్తి మర్మంగాన్ని కోసిన కూతురు!

Crime

Crime

రోజురోజుకూ వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ సంబంధాల కారణంగా దారుణమైన ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఓ వ్యక్తి తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో, కూతురు వ్యక్తి మర్మంగాలను కోసేసింది. ఏపీలోని బాపట్ల కు చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా తెనాలిలో ఉంటున్నాడు. అక్కడ దినసరి కూలీ పనిచేసుకుంటూ ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

లాడ్జిలో నివాసం ఉండే ఆ వ్యక్తి.. సదరు తల్లితో వ్యక్తిగత సంబంధాలు నెరిపేవాడు. క్రమం తప్పకుండా కలుసుకునేవాళ్లు. అయితే వీరిద్దరి వ్యవహరం కూతురుకి నచ్చకపోవడంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఓరోజు రామచంద్రారెడ్డి మహిళ నివస్తున్న ఇంటికి వెళ్లాడు. అక్కడ మద్యం సేవించి, ఆమె తో కలిసి అక్కడే నిద్రపోయాడు. దీంతో ఆగ్రహించిన కూతురు తన ప్రియుడితో కలిసి ఆ వ్యక్తి మర్మంగాన్ని బ్లేడ్ తో కోసేసింది. దీంతో అతడు కేకలు వేయడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version