Site icon HashtagU Telugu

TTD: తిరుమల ఘాట్ రోడ్డు చిరుత సంచారం

Leopard

Leopard

గత కొద్దిరోజులుగా తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతలు, పెద్ద పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత పదిహేను రోజుల క్రితం స్థానిక ఉద్యోగి తిరుమల నుంచి తిరుపతి వస్తుండగా ఓ పులి దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా చిరుత సంచారం భక్తులను భయపెడుతోంది. రెండో ఘాట్ రోడ్డులోని తొమ్మిదో కిలోమీటర్ వద్ద చిరుతపులి డివైడర్ పై కూర్చుని ఉంది. తిరుమల కొండకు వెళ్లే భక్తులు దాన్ని చూసి వీడియోలు తీశారు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. చిరుతల సంచారంతో భక్తులు రాత్రివేళలో ఘాట్ రోడ్డు ద్వారా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.