Site icon HashtagU Telugu

Crime: ఖిచిడీలో ఉప్పు ఎక్కువైంద‌ని భార్య‌ను చంపిన భ‌ర్త‌

Food

Food

మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భయాందర్ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న‌ నీలేష్ ఘాగ్ అనే వ్య‌క్తి త‌న భార్య నిర్మ‌ల‌ను హ‌త్య చేశాడు. అయితే హ‌త్య‌కు ఆమె వండిన ఖిచిడీ కారణ‌మ‌ని తెలుస్తోంది. ఆమె తయారు చేసిన ఖిచిడీలో ఉప్పు ఎక్కువ‌గా ఉందనే కోపంతో హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం భయాందర్ ఈస్ట్‌లోని ఫటక్ రోడ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దాడికి మరేదైనా రెచ్చగొట్టే కారణం ఉందా అని పోలీసులు నిర్ధారిస్తున్నారని అధికారి తెలిపారు.

Exit mobile version