హైదరాబాద్ లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులే టార్గెట్ గా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు జాహిద్ అనే వ్యక్తి కుట్ర పన్నాడు. ఇందులో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసం 6గురు యువకులను రిక్రూట్ చేసుకున్నారు. జాహిద్ కు పలు టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జాహిద్ ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.
2005లో జాహిద్ అనే వ్యక్తి హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ కార్యాలయలో బాంబు పేలుడు కేసులో నిందితుడు. దానికి సంబంధించిన కేసును 2017 లో కొట్టేశారు. అయితే కొంతకాలంగా ఉగ్రవాదులకు దూరంగా ఉన్న జాహిద్ తాజా కుట్రలో భాగమయ్యాడని పోలీసులు తెలిపారు. గతంలో మక్కా మసీదు పేలుళ్ల ఘటనలో కూడా జాహిద్ ను పోలీసులు ఇంటరాగేట్ చేశారు.
పోలీసుల విచారణలు పలు సంచలన నిజాలు బయటపడ్డాయి. జాహిద్ కు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ తో లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దసరా ఉత్సవాలే టార్గెట్ గా వీరు కుట్ర చేశారు. జాహిద్ కు సహకరించిన వారిలో మరో ముగ్గురు పరారీ అయ్యారు. జాహిద్ నుంచి పలు పేలుడు పదార్థాలతోపాటు లక్షా యాభై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.