Tiger Attacked: పార్క్‌లో భయానక ఘటన.. గాండ్రిస్తూ సందర్శకులపైకి వచ్చిన పులి

సరదాగా చెట్ల మధ్య గడిపేందుకు, జంతువులను చూసేందుకు చాలామంది జూ పార్క్ కు వెళుతూ ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు సెలవు రోజుల్లో వెళుతూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు కూడా కొంతమంది వెళుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - April 27, 2023 / 09:30 PM IST

Tiger Attacked: సరదాగా చెట్ల మధ్య గడిపేందుకు, జంతువులను చూసేందుకు చాలామంది జూ పార్క్ కు వెళుతూ ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు సెలవు రోజుల్లో వెళుతూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు కూడా కొంతమంది వెళుతూ ఉంటారు. పార్క్ లోని ఆహారం తీని రోజూ మొత్తం అక్కడే గడుపుతూ ఉంటారు. రకరకాల జంతువులను చూస్తూ ప్రశాంతంగా ఫీల్ అవుతారు.

పులి, సింహంతో పాటు అన్ని రకాల జంతువులను జూపార్క్ లో చూడవచ్చు. అయితే హాయిగా గడిపేందుకు జూపార్క్‌కు వెళ్లగా అక్కడ విషాదం చోటుచేసుకుంది. ప్రశాంతంగా గడుపుదామని పోయినవారికి షాక్ తగిలింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చోటుచేసుకుంది. కొంతమంది పర్యాటనకులు పార్క్ లోని సఫారీ రైడ్ పార్క్ కు వెళ్లారు. అయితే అక్కడ వారికి భయానక అనుభవం ఎదురైంది. పార్క్ వారి వాహనంలో కూర్చోని జంతువులను చూస్తుండగా.. ఓ పులి పైకి వచ్చి గాండ్రించింది.

సందర్శకుల పైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. దీంతో సందర్శకులు భయంతో వణికిపోయారు. పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆరిచారు. ఆ వాహనంలో ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొంతమంద సందర్శకులు పొదల వెనుక ఉన్న పులిని పొటోలు తీస్తుండగా అది ఒక్కసారిగా గాండ్రిస్తూ దూసుకొచ్చింది. డ్రైవర్ వెంటనే వాహనాన్ని అక్కడ నుంచి తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఊహించని ఘటనలో పర్యాటకులు షాక్ కు గురయ్యారు. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.