Robbery: ముసుగుల్లో వచ్చిన దొంగలు.. ఏకంగా లక్షల డాలర్ల వస్తువులు చోరీ?

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో దొంగతనాల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. దొంగతనాలకు దొంగలు వినూత్నంగా ఆలోచి

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 04:31 PM IST

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో దొంగతనాల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. దొంగతనాలకు దొంగలు వినూత్నంగా ఆలోచిస్తూ భారీగా దోచుకెళ్తున్నారు. గుంపులు గుంపులుగా రావడం లక్షలు కోట్లు విలువ చేసే వస్తువులు నగలు వంటివి తీసుకెళ్లడం అన్నది కామన్ అయిపోయింది. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

ముసుగులు ధరించిన 50 మంది దొంగలు ఒక దుకాణంలోకి హఠాత్తుగా దూసుకొచ్చారు. ఏదో పోటీ పెట్టినట్టుగా అందినకాడికి అక్కడి వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం జరిగిన ఆ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టొపంగా మాల్‌లోని నార్డ్‌స్ట్రామ్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లోకి దాదాపు 50 మంది వ్యక్తులు దూసుకొచ్చారు. ఎవరూ గుర్తించకుండా ముసుగులు ధరించారు. భద్రతా సిబ్బందిపై పెప్పర్‌ స్ప్రేను ప్రయోగించారు. తర్వాత చేతికందిన ఖరీదైన బ్యాగులు, దుస్తులు దోచుకున్నారు.

 

ఆ ఫ్లాష్‌ మాబ్ అంతే వేగంగా అక్కడి నుంచి జారుకుంది. దోపిడీదారులు హింసాత్మకంగా వ్యవహరించారని వీడియో చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం వారి కోసం గాలింపు జరుగుతోందని తెలిపారు. వారు దోచుకున్న వస్తువుల విలువ లక్ష డాలర్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆ ఆకస్మిక చర్యతో అక్కడున్న సిబ్బంది వారిని అడ్డుకోలేక నిస్సహాయులుగా నిలబడి చూస్తూ ఉండిపోయారు.