Shashikala Died: రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కున్న అమ్మాయి మృతి

విశాఖలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కునిపోయిన అమ్మాయి చనిపోయింది.

Published By: HashtagU Telugu Desk
WOMEN STUCKS

Cropped

విశాఖలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కునిపోయి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని శశికళ మృతి చెందింది. ప్లాట్ ఫాం పగులగొట్టి ఆమెను కాపాడే సమయానికి బ్లాడర్, నడుం భాగం ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ విద్యార్థినిని షీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది. దాంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీయే చదువుతోంది. ఆమె మరణవార్తలో కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది.

కంపార్ట్ మెంట్ నుంచి కిందికి దిగే ప్రయత్నంలో వెనుక నుంచి డోర్ బలంగా ఢీకొనడంతో శశికళ ప్రమాదవశాత్తు కిందికి జారిపోయింది. రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుని గంటల కొద్దీ నరకయాతన చవిచూసింది. రైల్వే రెస్క్యూ టీం స్పందించి ప్లాట్ ఫాంను పగులగొట్టినా, అప్పటికే ఆమెకు అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయి.

  Last Updated: 08 Dec 2022, 04:07 PM IST