IndiGo : ఇండిగో ఫ్లైట్‎కు తృటిలో తప్పిన ప్రమాదం, శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్

బెంగుళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈవిమానం బెంగళూరు నుంచి వారణాసి వెళ్లాల్సి ఉంది. విమానంలో(6E897)లో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగా ఈరోజు ఉదయం 6.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయినట్లు అధికారులు […]

Published By: HashtagU Telugu Desk
Indigo

1028434 Indigo Represent

బెంగుళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. వాస్తవానికి ఈవిమానం బెంగళూరు నుంచి వారణాసి వెళ్లాల్సి ఉంది. విమానంలో(6E897)లో 137 మంది ప్రయాణికులు ఉన్నారు.

సాంకేతిక లోపం కారణంగా ఈరోజు ఉదయం 6.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. బెంగళూరు నుండి విమానం బయలుదేరిన కొంతసేపటికి, దానిలో సాంకేతిక సమస్య గుర్తించి పైలట్‌ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.

  Last Updated: 04 Apr 2023, 10:10 AM IST