Site icon HashtagU Telugu

Dog Bite: వీధికుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల బాలుడు మృతి

Govt Bans Dogs

Dogs

Dog Bite: వీధికుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ప్రాంతంలోని వినోబా నగర్ పరిసరాల్లోని తన గుడిసెలో నిద్రిస్తున్న పసికందును డిసెంబర్ 8న వీధికుక్కలు దాడి చేసి గాయపర్చాయి.  దినసరి కూలీ కొడుకు తీవ్ర గాయాలపాలై ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం మృతి చెందాడు. ఈ ఏడాది హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో హృదయ విదారకమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ సంఘటన తర్వాత  అధికారులు వీధికుక్కల బెడదను చర్యలను తీసుకుంటున్నారు. అయినా ప్రతిరోజు రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో డజన్ల కొద్దీ కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో మార్చి నెలలో రేబిస్ వ్యాధితో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. అతన్ని వీధికుక్కలు కరిచాయి. తరువాత రేబిస్ లక్షణాలు కనిపించాయి. మే 19న హన్మకొండలోని కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఎనిమిదేళ్ల బాలుడిని వీధికుక్కలు చంపాయి కూడా.