Choreographer : ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. అమెరికన్‌ హిప్‌ హాప్‌ డ్యాన్స్‌,

Published By: HashtagU Telugu Desk
Choreographer Stephen Suicide

Choreographer Suicide

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. అమెరికన్‌ హిప్‌ హాప్‌ డ్యాన్స్‌ (American Hip-Hop Dancer), కొరియోగ్రాఫర్‌ (Choreographer), నటుడు డీజే స్టీఫెన్‌ (DJ Stephen) ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ హాటల్‌లో ఆయన గన్‌ తో షూట్‌ చేసుకున్ని ఆత్మహత్య పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. దీంతో హాలీవుడ్‌ నటీనటులు సోషల్‌ మీడియా (Social Media) వేదికగా స్టీఫెన్‌ మృతికి సంతాపం తెలుపుతున్నారు. ది ఎలెన్‌ డిజనరేస్‌ షో (The Ellen Degeneres Show), సో యూ థింక్‌ యూ కెన్‌ డాన్స్‌ (So You Think You Can Dance) వంటి రియాలిటీ షోలతో స్టీఫెన్‌ పాపులర్‌ అయ్యాడు. స్టెప్‌ అప్‌ (Step up), మ్యాజిక్‌ మైక్‌ డబుల్‌ ఎక్స్‌ (Magic Mike Double X) సినిమాల్లో కూడా ఆయన నటించాడు. అలాగే టెలివిజన్‌ ప్రొడ్యూర్‌ గా కూడా స్టీఫెన్‌ గుర్తింపు పొందాడు. కాగా స్టీఫెన్‌ కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

Also Read:  Relationship Tips : ఈ 5 విషయాలను తెలుసుకున్న తరువాతే రిలేషన్ షిప్ లోకి వెళ్ళండి..

  Last Updated: 15 Dec 2022, 04:38 PM IST