Site icon HashtagU Telugu

Living With Dead : ఏడాదిగా ఇంట్లో మృతదేహంతో జీవిస్తున్న కుటుంబం…ఎక్కడంటే..!!

Deaths

Deaths

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ కుటుంబం ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఏడాదిన్నర కాలంగా జీవిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు చేస్తే ఆదాయపన్నుశాఖలో విమ్లేశ్ కుమార్ పనిచేస్తున్నారు. ఆయన ఏప్రిల్ 2021లో అనార్యోగంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. డెత్ సర్టిఫికేట్ కూడా కుటుంబ సభ్యులకు అందించారు. శవాన్ని ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా…విమ్లేశ్ కుమార్ లో హఠాత్తుగా స్పృహ వచ్చిందని అంత్యక్రియలను నిలిపివేశారు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఇంట్లోనే ఉంచారు.

విమ్లేశ్ కుమార్ కోమాలో ఉన్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒక రోజు సీఎంఓ కార్యాలయం నుంచి విమ్లేశ్ కుమార్ ఇంటికి విచారణ కోసం అధికారులు రావడంతో ఈ విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు కంగుతిన్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో…ఆరోగ్యశాఖ బృందం విమ్లేశ్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. అతను మరణించినట్లు చెప్పిన కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. తమ కుమారుడు మరణించలేదని..పల్స్ రేటు కొట్టుకుంటుందని…కోమాలో ఉన్నారని విమ్లేశ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కుటుంబ సభ్యులను ఒప్పించి విమ్లేశ్ కుమార్ శవాన్ని ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.