Site icon HashtagU Telugu

Dog Traveller: ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న కుక్క, నెటిజన్స్ ఫిదా!

Dog Travel

Dog Travel

రోజూ మనం కోరుకున్న గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో లేదా లోకల్ రైలులో వెళ్తాము. అయితే, జంతువులు కూడా ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలనుకుంటాయా అంటే అవుననే సమాధానం ఇస్తోంది ఓ కుక్క. మాకు అవసరాలు ఉంటాయి.. మేం ఈ ప్రపంచంలో భాగమే అని సంకేతం ఇస్తోంది. ముంబైలోని లోకల్ ట్రైన్ లో ఓ కుక్క ప్రతిరోజు ప్రయాణిస్తూ ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తోంది. ఓ స్థానికుడిని రైలులో కుక్క ఎక్కిస్తున్నట్లు ద్రుశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

ఈ వీడియోకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. బోరివాలి స్థానికుడిని ప్రతిరోజూ తీసుకెళ్లి అంధేరిలో దిగబెడుతుంది. “#ముంబయిలో లోకల్ ట్రైన్ రెగ్యులర్ ట్రావెలర్‌ని కలవండి” అని వీడియో క్యాప్షన్ నెటిజన్స్ ఆకట్టుకుంటోంది. చాలామంది కుక్క కోసమే లోకల్ ట్రైన్ ఎక్కుతున్నారు కూడా. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను చూసేయ్యండి.

Also Read: Keerthy Suresh BF: అతడే కీర్తి భాయ్ ఫ్రెండ్.. దసరా బ్యూటీ రియాక్షన్ ఇదే!