Site icon HashtagU Telugu

Dog Saved Person: గుండెపోటుకు గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడిన శునకం.. ఎలానో తెలుసా..?

Whatsapp Image 2023 05 10 At 21.24.12

Whatsapp Image 2023 05 10 At 21.24.12

Dog Saved Person: పోలీసులు శిక్షణ ఇస్తే జాగిలాలు నేరస్తులను పసిగట్టడంలో సహాయం చేస్తాయి. అలాగే పేలుడు పదార్ధాలు, మత్తు పదార్థాలు లాంటివి కూడా జాగితాలు పసిగట్టి పోలీసులకు హెల్ప్ చేశాయి. అయితే ఇప్పుడు ఓ శునకం గుండెపోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ప్రాణాలు రక్షించే హీరోగా మారింది. అందేకాదు అవార్డును కూడా గెలుచుకుని అందరి మనస్సులను సంపాదించుకుంది. అందరి చేత ఈ శునకం ప్రశంసలు పొందుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గుండెపోటుతో తల్లడిల్లుతున్న వ్యక్తి ప్రాణాలను శనకం కాపాడింది. ఈ ఘటన జపాప్‌లోని చిబా నగర సమీపంలో చోటుచేసుకుంది. వాకబాకు ఏరియాలో ఉన్న ఓ గుర్రపు స్వారీ క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి మూడు నెలల క్రితం గుర్రపు స్వారీ క్లబ్‌కు చేరుకున్నాడు. అయితే స్వారీ సమయంలో అతడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. గుండెపోటుకు గురై ఒక్కసారిగా నొప్పితో కుప్పకూలిపోయాడు. ఈ సమయంలో కౌమే అనే కుక్క అతడిని చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది.

కుక్క అరుపుతో క్లబ్ లోని వారందూ గుండెపోటుతో వ్యక్తి పడిపోయి ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వ్యక్తి నేలపై పడి ఉండటం గమనించారు. దీంతో అతడిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు వెంటనే చికిత్స అందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అదే ఆసుపత్రికి తరలించడం ఆలస్యం అయి ఉంటే ఈ వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గట్టిగా అరిచి వ్యక్తి ప్రాణాలు కాపాడిన శునకాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఈ క్రమంలో శునకాన్ని అగ్నిమాపక సిబ్బంది అభినందించారు. శునకానికి ప్రశాంసా పత్రన్ని అందించడంతో పాటు రికార్డు ప్రకటించారు. అయితే ఈ శునకం ఎప్పుడూ ఆ క్లబ్ లోనే ఉంటుందట. ఇది ఎప్పుడూ సైలెంట్ గా ఉంటుందని, అత్యవసర సమయాల్లో మాత్రమే గట్టిగా అరుస్తుందని క్లబ్ నిర్వహకులు చెబుతున్నారు. గతంలోనూ ఒక గుర్రం కంచె దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే ఇలాగే అరిచి తమను అప్రమత్తం చేసిందని క్లబ్ యాజమాన్యం చెబుతోంది. గతంలోనూ చాలాసార్లు తమకు సహయం చేసిందని అంటున్నారు.