Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన మొత్తం విలువ రూ.745 కోట్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు డబ్బు, మద్యం, బంగారం కలిపి మొత్తం రూ.745 కోట్ల మేర సీజ్ అయింది. చేరుకుంది. ఈ నెలలో ఎన్నికలకు వెళ్లిన అన్ని రాష్ట్రాలలో ఇదే అత్యధికం.

Published By: HashtagU Telugu Desk
Telangana Elections 2023

Telangana Elections 2023

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు డబ్బు, మద్యం, బంగారం కలిపి మొత్తం రూ.745 కోట్ల మేర సీజ్ అయింది. చేరుకుంది. ఈ నెలలో ఎన్నికలకు వెళ్లిన అన్ని రాష్ట్రాలలో ఇదే అత్యధికం. అక్టోబర్ 9న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో నగదు, బంగారం, మద్యం భారీగా పట్టుబడింది. అంతెందుకు గత 24 గంటల్లో 8.07 కోట్లు పట్టుబడ్డాయి. దీంతో మొత్తం విలువ రూ.745 కోట్లకు చేరుకుంది.

2018 ఎన్నికల్లో నగదు, మద్యం, ఇతర వస్తువుల విలువ కేవలం రూ.103.89 కోట్లు మాత్రమే. అయితే అక్టోబర్ 9 నుంచి పట్టుబడిన నగదు రూ.305.72 కోట్లకు చేరింది. 24 గంటల వ్యవధిలో రూ.2.66 కోట్ల విలువైన మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. దీంతో ఇప్పటివరకు పట్టుబడిన మద్యం మొత్తం విలువ రూ.127.55 కోట్లు. 2.63 లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి తదితర వాటి విలువ రూ. 187 కోట్లు. ఇందులో 303 కిలోల బంగారం, 1,195 కిలోల వెండి ఉన్నాయి. కాగా పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం ఉండడంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు గట్టి నిఘా ఉంచాయి.

Also Read: Telangana Elections 2023: ఎన్నికల వేళ నగరంలో బస్ స్టాప్‌లు కిక్కిరిసిపోయాయి

  Last Updated: 29 Nov 2023, 09:04 PM IST