Site icon HashtagU Telugu

Bravery: సాహ‌స పోలీస్‌.. నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్‌

vijaywada cop

vijaywada cop

కుంచనపల్లి హైవే దగ్గర బ్రిడ్జి పైనుంచి కెనాల్ లో దూకిన వ్య‌క్తిని కానిస్టేబుల్ కాపాడారు. విజయవాడ ప్రసాదంపాడు కు చెందిన 70 సంవత్సరాల వెంకటేశ్వర్లు కెనాల్ లో దూక‌డాన్ని అటుగా వెళుతున్న విజయవాడ క్లూస్ టీం కానిస్టేబుల్ సురేష్ కుమార్ చూశారు. బ్రిడ్జి పై నుంచి కానిస్టేబుల్ కూడా కెనాల్ దూకి సకాలంలో బాధితుడిని ఒడ్డుకు చేర్చడం తో ప్రాణపాయం త‌ప్పింది. ఆరు నెలలుగా నిద్ర లేకపోవడంతో మనోవేదనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

వెంకటేశ్వర్లును తీసుకొని తాడేపల్లి పోలీసులకు కానిస్టేబుల్ సురేష్ అప్ప‌గించాడు. జరిగిన విషయం తెలుసుకుని కానిస్టేబుల్ సురేష్ కుమార్ ని తాడేపల్లి సీఐ శేషగిరిరావు అభినందించారు. సురేష్ కుమార్ ఎంతో సాహ‌సంగా వెంక‌టేశ్వ‌ర్ల‌ను కాపాడినందుకు స్థానిక ప్రజలు, తాడేపల్లి పోలీసులు అభినందించారు

Exit mobile version