Site icon HashtagU Telugu

Vinod Kumar: రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే హైకోర్టులో కేసు వేస్తా: బోయినపల్లి

Brs Ex Mp Vinod Kumar Comme

Vinod Kumar: సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ కళాతోరణం, చార్మీ నార్ ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడటం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ కోట లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాకతీయుల 11, 12వ దశాబ్దాల్లో యావత్తు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని, కాకతీయులు రాచరిక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాదని, పేదల కోసం పని చేసిన వారని అన్నారు. కాకతీయుల కాలంలో తెలంగాణ లో గోలుసుకట్టు చెరువులతో పాటు రామప్ప, పాకాల, లక్నవరం, ఘనపూర్, సింగసముద్రం, నల్లగొండ జిల్లాలో పానగల్ ఉదయసముద్రం రిజసర్వాయర్ లతో పాటు వేలాది చెరువులు, కుంటలను నిర్మాణం చేయడంతోనే ఈ రోజు తెలంగాణ రైతాంగం బ్రతికి బట్టగలుగుతుందని ,తెలంగాణ వచ్చాక పదేళ్ళలో తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పకుండా తీసుకోవాలని…రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే నేనే స్వయంగా హైకోర్టులో కేసు వేస్తానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ని తీసుకువచ్చి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంలో మార్పులు చేయాలని చూస్తున్నారని….. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు హయాంలో తెచ్చిన జాతీయ చిహ్నంలో మార్పులు చేస్తారా అని ప్రశ్నించారు.