Site icon HashtagU Telugu

Kadapa: కడప జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం!

British

British

కడప జిల్లాలో బ్రిటీష్‌ కాలం నాటి భూగర్భ జలాశయం వెలుగుచూసింది. మొదట అందరూ సొరంగ కారాగారంగా భావించారు. సమగ్రంగా పరిశీలించిన అనంతరం జలాశయంగా గుర్తించారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం గ్రామ సమీపంలో వెలుగుచూసిన ఈ భూగర్భ జలాశయాన్ని 1890లో బ్రిటీష్‌ వారు నిర్మించినట్లు అక్కడ శిలాఫలకం ఉంది. తాగునీటి అవసరాల కోసం ఇక్కడ నీటిని నిల్వ చేసుకునేవారని, అవసరమైనప్పుడు గ్రావిటీ ద్వారా కడపకు తీసుకెళ్లేవారని నిపుణులు చెబుతున్నారు.