Site icon HashtagU Telugu

Bike Runs On Beer: బీర్‌తో నడిచే బైక్.. గంటకు 240 కిలోమీటర్ల వేగం.. భలే ఉంది కదా..

Bike Runs On Beer

Bike Runs On Beer

Bike Runs On Beer: మాములుగా బైక్ లు పెట్రోల్ లేదా డీజిల్ తో నడుస్తాయి. ఇక ఎలక్ట్రిక్‌తో నడిచే బైక్‌లు కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్య ఎలక్ట్రికల్ బైక్ లు, కార్లు కూడా మార్కెట్ లోకి విపరీతంగా వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎక్కువమంది ఎలక్ట్రిక్ బైక్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ బైక్ కాస్త వెరైటీ.. బీర్ తో ఈ బైక్ నడుస్తోంది.

ఈ బీర్ బైక్ 240 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. అమెరికాకు చెందిన మైకేల్సన్ అనేఅనే వ్యక్తి ఈ బీర్ బైక్ ను తయారుచేశాడు. గతంలో ఇదే వ్యక్తి రాకెట్ తో నడిచే టాయిలెట్‌తో పాటు జెట్ తో నడిచే కాఫీపాట్ ను తయారుచేశాడు. తాజాగా బీర్ తో నడిచే ఈ బైక్ ను కొనుగొన్నాడు. ఈ బీర్ బైక్ కు సంబంధించిన వివరాలను ఫాక్స్ 9తో మైఖేల్సన్ షేర్ చేసుకున్నాడు.

ఈ బీర్ బైక్ లో అమర్చిన హీటింగ్ కాయిల్ బీర్ ను 300 డిగ్రీల వరకు మండిస్తుందని హైఖేల్సన్ చెబుతున్నాడు. నాజిల్స్ లో ఆవిరి జనరేట్ అవ్వడం ద్వారా బైక్ పనిచేస్తుందని అంటున్ారు. బీరుతో నడిచే మోటార్ సైకిల్ బ్లూమింగ్టన్ లోని తన గ్యారేజీలో నిర్మించినట్లు హైఖేల్సన్ చెబుతున్నాడు. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ దూసుకెళ్తుందని అంటున్నాడు.

రెడ్ బుల్, కారిబౌ కాఫీతో పాటు ఉదైనా ద్రవం కూడా ఈ బైక్ కు ఇంధనంగా వాడుకోవచ్చని మైఖేల్సన్ చె్పుకొచ్కాడు. అయితే మైఖేల్సన్ ను మద్యం తాగే అలవాటు లేదని, ఇలా బీర్ తో నడిచే బైక్ ను తయారుచేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఈ బైక్ ను వివిధ ప్రదర్శనలలో ఉంచాడు. అనంతర తన ఇంట్లోని మ్యూజియంలో బైక్ ఉంచుకున్నాడు.

Exit mobile version