Site icon HashtagU Telugu

Millionaire: అడుక్కునే అబ్బాయి ఒక్కర్రాత్రిలో కోటీశ్వరుడు అయ్యాడు..!

Boy

Boy

Millionaire: అదృష్టలక్ష్మి ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో తెలియదు కానీ ఆరోజు మాత్రం అది వారి జీవితాన్నే మార్చేస్తుంది. ఊహించని రీతిలో ఒక్కసారిగా లక్ మనల్ని గట్టిగా హత్తుకుంటుంది. ఉత్తరప్రదేశ్లోని ఒక అనాధ బాలుడిని కూడా అదృష్టం ఇలానే పలకరించింది. ఒక రాత్రిలో భిక్షాటన చేసుకుని బ్రతుకుతున్న ఆ బాలుడు కాస్తా కోటేశ్వరుడు అయిపోయాడు.

ఉత్తరప్రదేశ్ లోని పండౌలి గ్రామానికి చెందిన షాజీబ్ ఆలం తల్లిదండ్రులు ఈ మధ్యనే చనిపోయారు. ఇక ఆ బాలుడు ఇంటి నుండి పారిపోయి వెళ్ళిపోయాడు. అతని కోసం బంధువులు ఎంత గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే తల్లిదండ్రుల మరణం తర్వాత షాజబ్ ఆలం తాత కూడా చనిపోయాడు. ఇక వీలునామా ప్రకారం అతనికి ఉన్న రెండంతస్తుల ఇల్లు, రెండు కోట్ల భూమి షాజబ్ అలం పేరు మీదకు వచ్చింది. కొద్దిరోజుల తర్వాత బంధువుల శ్రమ ఫలించి షాజబ్ ఆలం కనిపించాడు. రూర్కి లోని కళ్యాణ్ మందిరంలో భిక్షాటన చేస్తూ బతుకుతున్న షాజబ్ ను వారు ఇంటికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు అతను కోటీశ్వరుడు. భిక్షాటన చేయవలసిన అవసరం లేదు. తన కష్టాలన్నీ తీరిపోయాయి.

ఇలా ఓవర్ నైట్ లో ఆ బాలుడి తలరాత జస్ట్ అలా మారిపోయింది. భవిష్యత్తుపై ఎలాంటి అంచనా, ఆశకు లేకుండా పోతున్న బాలుడు జీవితంలో అయిన వారు దూరమైనప్పటికీ అతనిని అదృష్టం వరించి ధనవంతుడిగా మార్చేసింది.