Site icon HashtagU Telugu

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్.. ఇంట్లోకి చొరబడి ఏం చేసిందటే!

Bear Attack

Bear Attack

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అటవీ జంతువుల సంచారం ఎక్కువగా ఉంది. అందుకే రాత్రి వేళలో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండగా, శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి భయం కారణంగా జనాలు గుంపుగుంపులుగా తిరుగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోగా.. తాజాగా మరోసారి హల్ చల్ చేస్తుంది ఎలుగుబంటి.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఊరు మధ్యలోని ఓ పాడుబడిన ఇంటిలోకి చొరబడి ఇంట్లోనే తిష్ట వేసింది. దీంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సమాచారం తెలుసుకొని గ్రామానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఎలుగుబంటిని ఇంటి నుండి బయటకు తరిమెందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎలుగుబంటి సంచారంతో ఇక గ్రామస్తులకు పలు సూచనలు ఇస్తున్నారు అటవీశాఖ సిబ్బంది.