Sircilla: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి!

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 12:34 PM IST

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సోమవారం 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. సుశాంత్‌గా గుర్తించబడిన బాలుడు తాళ్లపల్లి శంకర్, సరిత అనే పేద దంపతుల చిన్న కుమారుడు. సుశాంత్‌ ముస్తాబాద్‌ మండలంలోని ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవుల కోసం బాలుడు శనివారం ఇంటికి వచ్చాడు. సోమవారం స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఛాతిలో నొప్పి వచ్చిందని వాపోయాడు.

బాలుడి స్నేహితులు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే సుశాంత్‌ను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో బాలుడికి గుండెపోటు వచ్చిందని, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ దంపతులకు మరో కుమారుడు జశ్వంత్‌ కోనరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్నాడు.

ఆధునిక జీవన శైలి వల్ల అన్ని వర్గాల ప్రజల జీవితాల్లోనూ చాలా మార్పులు వస్తున్నాయి. రక్తపోటు, మధుమేహం, హృద్రోగాలు, ఊబకాయం లాంటి వ్యాధులతో బాధపడేవారే సంఖ్య కూడా ప్రస్తుతం పెరుగుతోంది. జీవన శైలిలో మార్పుల వల్ల వచ్చే వ్యాధుల్లో కొన్ని మానసిక రుగ్మతలు కూడా ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత జీవన శైలి వ్యాధుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఒకప్పుడు 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలోనే హృద్రోగ సమస్యలు కనిపించేవి. కానీ, నేడు చాలా మంది యువత కూడా హృద్రోగాల బారిన పడుతున్నారు.