Site icon HashtagU Telugu

Khammam: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మృతి

Khammam

New Web Story Copy (29)

Khammam: కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కి గురై పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుకు గురై మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది.

తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. పద్నాలుగేళ్ల ఎం. రాజేష్ ఉదయం పాఠశాలకు వెళ్ళాడు. కాసేపటికే ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. స్కూల్ టీచర్లు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో గుండెపోటు ఆందోళన కలిగిస్తుంది. ఇరవై సంవత్సరాలు కూడా నిండని వారు గుండెపోటుకు గురవుతున్నారు.

Also Read: CSK: చెన్నై సూపర్ కింగ్స్ మరో మైలురాయి.. 10 మిలియన్ల ఫాలోవర్లను చేరుకున్న సీఎస్కే..!