Site icon HashtagU Telugu

98 Mobiles Missing: ఒక్కరోజే 98 మొబైల్స్ చోరీ

The Best Smartphones

The Best Smartphones

హైదరాబాద్‌లో ఒక్కరోజే 98 మొబైల్స్ మిస్ అయ్యాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో మొబైల్స్ మిస్ అయ్యాయి. ఎందుకంటే ఊరేగింపు సమయంలో వివిధ వ్యక్తుల మొబైల్‌లు వారి చేతుల నుంచి పడిపోయాయి. భారీ రద్దీ కారణంగా వారు తమ ఫోన్‌లను వెనక్కి తీసుకోలేకపోయారు. అయితే వీటిలో భక్తుల తమ మొబైళ్లను మిస్ చేసుకుంటే, మరికొన్నింటిని దొంగలు దొంగిలించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందాయి. అయితే ఈ 98 మొబైళ్లను భక్తులు మిస్ చేసుకున్నారా.. దొంగలు దొంగిలించారా? అనేది తేలాల్సి ఉంది.