Site icon HashtagU Telugu

Theft of Kia Engines : కియా ఇంజన్లు చోరీ చేసింది ఎవరో కాదు..!

900 Kia Car Engine Stolen I

900 Kia Car Engine Stolen I

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా ఇండియా కంపెనీలో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. 2020 సంవత్సరం నుండి ఇప్పటివరకు సుమారు 900 కారు ఇంజిన్లు చోరీ(900 Kia car engines stolen)కి గురైనట్టు అధికారిక సమాచారం. ఈ చోరీ వ్యవహారం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం. ఈ ఘటనపై కంపెనీ మేనేజ్‌మెంట్ కఠినంగా స్పందించడంతో సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Panchayat Secretary : వామ్మో..పంచాయతీ కార్యదర్శి ఆస్తి రూ.85 కోట్లు!

ఈ ఇంజన్ చోరీ వ్యవహారంలో కంపెనీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, అలాగే ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులపై అధికారులు అనుమానంతో విచారణ చేపట్టారు. కంపెనీ సెక్యూరిటీ వ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. కంపెనీ ఎండీ మరియు సీఈవో గ్వాంగులీ ఈ విషయం గుర్తించి, జిల్లాకు చెందిన ఎస్పీని కలసి గోప్యంగా దర్యాప్తు చేయమని కోరినట్లు సమాచారం.

Jagan comments : జగన్‌ క్షమాపణలు చెప్పాలి: పోలీసు అధికారుల సంఘం

అధికారులు అధికారికంగా ఫిర్యాదు చేయాలని సూచించడంతో, 2024 మార్చి 19న పెనుకొండ పరిధిలోని కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనపై పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. కంపెనీ అంతర్గతంగా కూడా తనిఖీలు ప్రారంభించింది. ఈ ఘనతకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.