Site icon HashtagU Telugu

Temple Collapse-9 Lost Life : కొండచరియలు విరిగిపడి కూలిపోయిన శివాలయం.. 9 మంది మృతి

Temple Collapse 9 Lost Life

Temple Collapse 9 Lost Life

Temple Collapse-9 Lost Life : ఎడతెరిపిలేని వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. రాష్ట్ర రాజధాని సిమ్లాలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో  నగరంలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో ఉన్న శివాలయంపైకి కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల ధాటికి ఆలయం కూలిపోవడంతో తొమ్మిది మంది చనిపోయారు.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రెస్క్యూ టీమ్స్ బయటికి తీశాయి.

Also read : Independence day 2023 : ప్ర‌పంచ పెద్ద‌గా 2047లో భార‌త్ ఇలా..

ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.  కొండచరియలు విరిగిపడిన సమయంలో ఆలయంలో దాదాపు 50 మంది భక్తులు ఉన్నారని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సిఖు సందర్శించారు. ఆయన దగ్గరుండి రెస్క్యూ  వర్క్స్ చేయిస్తున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 21 మంది ప్రాణాలు(Temple Collapse-9 Lost Life)  కోల్పోయారు.