Site icon HashtagU Telugu

Disney+ Hotstar: “9 అవర్స్” వెబ్ సిరీస్ స్ట్రీమింగ్

9 Hours

9 Hours

సరికొత్త కంటెంట్ ను ఎప్పటికప్పుడు వ్యూయర్స్ కు సిద్ధం చేస్తున్న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. 9 అవర్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్, జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఖైదీలు ఓ భారీ దొంగతనానికి ప్లాన్ చేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న వాళ్లు బ్యాంక్ లోకి ఎలా చొరబడారు. అక్కడ వాళ్లు అనుకున్న ప్లాన్ వర్కవుట్ అయ్యిందా, ఇంతలో పోలీస్ తీసుకున్న చర్యలేంటి అనేది ఈ వెబ్ సిరీస్ లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

Exit mobile version