Chennai : చెన్నైలో విషాదం… స్కూల్ టాయిలెట్‌లో జారిప‌డి బాలుడు మృతి

చెన్నై పొన్నేరిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో విషాదం నెల‌కొంది. టాయిలెట్‌లో 8వ తరగతి బాలుడు జారిపడి మృతి చెందాడు.

Published By: HashtagU Telugu Desk
Death Representative Pti

Death Representative Pti

చెన్నై పొన్నేరిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో విషాదం నెల‌కొంది. టాయిలెట్‌లో 8వ తరగతి బాలుడు జారిపడి మృతి చెందాడు. బాధితుడిని మెత్తూరు గ్రామానికి చెందిన ఎస్ ప్రతీశ్వరన్‌గా గుర్తించారు. శుక్రవారం ఉదయం పాఠశాల భవనంలోని మరుగుదొడ్డిలో ప్రతీశ్వరన్ జారి పడిపోయాడు. అక్కడే ఉన్న ఇతర విద్యార్థులు అతడిని బయటకు తీశారు. పాఠశాల సిబ్బంది అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు ప్రకటించారు. పొన్నేరి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, బాలుడి తల్లిదండ్రులు, బంధువులు శుక్రవారం ఉదయం పొన్నేరి-తిరువొత్తియూర్ హైవేపై బైఠాయించారు. పోలీసు ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. బాలుడు టాయిలెట్‌లోకి వెళ్లడం, క్షణాల తర్వాత బయటకు తీయడం వంటి సీసీటీవీ ఫుటేజీలు అందుబాటులో ఉన్నాయని పోలీసులు తెలిపారు.

  Last Updated: 01 Apr 2023, 08:56 AM IST