Site icon HashtagU Telugu

Lightning: విషాద ఘటన.. పిడుగుపాటుకు 30 గొర్రెలు, 56 మేకలు మృతి.. ఎక్కడంటే..?

Lightning

Lightning 1280p

Lightning: పశ్చిమ రాజస్థాన్‌లో రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షాల సమయంలో జైసల్మేర్ (Jaisalmer) జిల్లాలోని నోఖా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని నిర్జన ప్రదేశంలో పిడుగుపాటు (Lightning)కు 86 జంతువులు చనిపోయాయి. ఈ ఘటన సోమవారం (జూన్ 26) సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుండపోత వర్షాల మధ్య మేఘవాలోన్ కి ధాని క్యాంప్ రోడ్డు సమీపంలో గొర్రెలు, మేకల కాపరి ఉమర్ ఖాన్ వర్షం నుండి తనను, తన గొర్రెలు, మేకలను రక్షించడానికి చెట్టు కింద నిలబడి ఉన్నాడు. ఈ కుండపోత వర్షం 30 నుంచి 40 నిమిషాల పాటు కొనసాగింది. ఇంతలో అకస్మాత్తుగా పిడుగు ఆ చెట్టుపై పడింది. పశువుల పెంపకందారుడు ఉమర్ ఖాన్ పిడుగుపాటుకు గురై కిందపడిపోగా చెట్టు కింద నిలబడి ఉన్న గొర్రెలు, మేకలన్నీ చనిపోయాయి.

బాధిత కాపరి ఏం చెప్పాడు..?

పశువుల కాపరి ఉమర్ ఖాన్ సోమవారం (జూన్ 26) సాయంత్రం జంతువులతో తన ఇంటికి తిరిగి వస్తున్నట్లు చెప్పాడు. అదే సమయంలో భారీ వర్షం మొదలైంది. వర్షంకు తడవకుండా ఉండేందుకు ఉమర్ ఖాన్ తన గొర్రెలు, మేకలతో చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డాడు. అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడింది. నేను చెట్టు నుండి చాలా దూరంగా పడిపోయానని బాధితుడు చెప్పాడు.

Also Read: Rahul Gandhi: మెకానిక్‌ అవతారమెత్తిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ..!

పిడుగుపాటుకు గొర్రెలు, మేకలు మృతి

అయితే ఈ ప్రమాదంలో ఉమర్ ఖాన్‌కు పెద్దగా గాయాలు కానప్పటికీ. పిడుగుపాటుకు చెట్టు కాలిపోయి చెట్టుకింద ఉన్న 30 గొర్రెలు, 56 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై గ్రామస్థులకు సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాధితుడిని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు

పిడుగుపాటు వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే నోఖ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తహసీల్దార్ అశోక్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిరుపేద పశువుల కాపరి ఉమర్‌ఖాన్‌కు ఆర్థిక సహాయం అందించాలని అక్కడి ప్రజలు అధికారులను కోరారు.