Site icon HashtagU Telugu

Dead Lizard: మ‌ధ్యాహ్న భోజ‌నంలో బ‌ల్లి… 80 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

midday meal

File Photo -midday meal

కర్ణాటకలోని ఓ పాఠ‌శాల‌లో మ‌ధ్యాహ్న భోజ‌నం చేసిన 80 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. హవేరి జిల్లా రాణిబెన్నూరు సమీపంలోని వెంకటాపుర తండా లోని ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో సాంబ‌ర్ లో బ‌ల్లి పండింది.అయితే ఈ సాంబ‌ర్ తిన్న విద్యార్థులు అస్వ‌స్థ‌కు గురైయ్యారు. బల్లి కనిపించిన సాంబార్ తిన్న 80 మంది పాఠశాల విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ రాణిబెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యా శాఖ అధికారుల స‌మాచారం ప్రకారం, ఇద్దరు విద్యార్థుల‌ పరిస్థితి క్లిష్టంగా ఉందని.. మిగిలిన 78 మంది విద్యార్థులు ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న‌ట్లు స‌మాచారం. పాఠ‌శాల‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో ఒక విద్యార్థికి బల్లితో సాంబారు వడ్డించారని ప్రత్యక్ష సాక్షులు అధికారులకు తెలిపారు.బల్లిని చూసిన విధ్యార్థి ఇతర విద్యార్థుల‌ను అప్రమత్తం చేయ‌గా… కొద్దిసేపటికే ఇతర విద్యార్థులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల‌ నిర్లక్ష్యంపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది.

 

Exit mobile version