Site icon HashtagU Telugu

Rs 2000 Note Exchange: రూ.2 వేల నోటు మార్పిడికి విముఖత చూపిస్తున్న ప్రజలు.. డిపాజిట్ చేసుకోవడం బెస్ట్ అంటూ?

2000 Notes

Rs 2000 Note Exchange

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రూ.2 వేల ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సెప్టెంబర్ ఆకరి వరకు గడువునిచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు వారి దగ్గర ఉన్న 2 వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు అనుమతిని ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ఎక్కువ శాతం మంది భారతీయులు రూ.2 వేల నోట్లను మార్చుకోవడం కంటే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. 80% మంది ప్రజలు డిపాజిట్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

రూ.2 వేల నోట్లను చిన్న నోట్లుగా మార్చుకోవడానికి ప్రజలు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. దానికి బదులు ఖాతాల్లో డబ్బులను డిపాజిట్ చేసుకుంటున్నారు. గత నెలలో ఆర్బిఐ 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే కేవలం రోజుకి 20,000 రూపాయలు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఎక్కువ డబ్బులు ఉన్నవారు పదేపదే బ్యాంకుల చుట్టూ తిరిగే ఓపిక లేక డిపాజిట్ చేయడానికి ఆసక్తినీ చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అకౌంట్లో జమ చేసిన మార్చుకున్న మొత్తం నోట్ల విలువ అందుబాటులో లేనప్పటికీ ఆరు ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకర్లు రాయిటర్స్ తో మాట్లాడుతూ..

తమకు వచ్చిన నోట్లలో 80 శాతం ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. మే నెల 23 నుంచి ఉపసంహరణ ప్రారంభం అయినప్పటి నుంచి మొదటి వారంలో సుమారుగా 170 బిలియన్ల రూపాయలు పొందినట్లు ఎస్బిఐ వెల్లడించింది. ఇందులో దాదాపు 149 బిలియన్లు అంటే 82% ఖాతాల్లో జమ కాగా మిగిలినవి ఏ మార్చుకున్నారు. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తమకు వచ్చిన నోట్లో 80 నుంచి 90% నోటు డిపాజిట్ అయినట్లు తెలిపారు.

Exit mobile version