Site icon HashtagU Telugu

1 killed : పాయ‌క‌రావుపేట‌లో విషాదం.. పాఠశాల గోడ కూలి 8 ఏళ్ల బాలుడు మృతి

Fire Accident

Dead Body

పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక మండ‌ల ప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ప్ర‌హ‌రీ గోడ కూలి 8 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మృతుడు తులసి సిద్ధు ప్రసన్నగా పోలీసులు గుర్తించారు. పాఠశాల వెనుక బాత్‌రూమ్‌ల నిర్మాణ పనుల్లో గోడ కూలిపోవడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్ల‌డించారు. నిర్మాణ స్థలంలో గోడ స‌పోర్ట్ కోసం ఓ స్తంభాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పక్కనే ఆడుకుంటున్న సిద్ధు ప్రమాదవశాత్తు సపోర్టు పోల్‌ను లాగడంతో అది కిందపడి తలపై కొట్టడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. వెంటనే సిద్దును ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:  Why A.P. Needs Jagan : మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలి..?