Site icon HashtagU Telugu

Visakhapatnam: ఏపీలో తప్పిన పెను ప్రమాదం

Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam: వైజాగ్ లో పెను ప్రమాదం తప్పింది. సంగం శరత్ థియేటర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోని లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అప్రమత్తమై చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. క్లీనర్‌ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో విద్యార్థులు హాసిని ప్రియ, జి.గాయత్రి, వాణి జయ రమ్య, భవేష్, లక్ష్య, చార్విక్, కుశాల్ కెజి, కయూష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.అయితే ఎలాంటి మరణాలు చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 7:30 గంటలకు ప్రమాదం జరిగిందన్నారు. ఆటోలో ఉన్న ఎనిమిది మంది చిన్నారులు బెథాని పాఠశాలకు చెందినవారుగా గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం ఆటో డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఏసీపీ రాజీవ్‌ తెలిపారు.

Also Read: Orxa Mantis: ఈ బైక్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే 221 కి.మీల వరకు పరుగులు.. ధర ఎంతో తెలుసా..?