Massive Blast : పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బరాసత్ ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఇందులో ఏడుగురు సజీవ దహనమయ్యారు. వారి శరీర భాగాలు సంఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. పేలుడు ధాటికి బాణసంచా తయారీ కేంద్రం గోడలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారికి స్థానిక హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది. రెస్క్యూ వర్క్స్ లో జాప్యం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది ? దీనికి బాణసంచా తయారీ కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా ? అనేది తెలియాల్సి ఉంది.
Massive Blast : ఏడుగురు సజీవ దహనం.. భారీ పేలుడుతో చెల్లాచెదురుగా శరీర భాగాలు

Bomb blast