Site icon HashtagU Telugu

Bus Falls Into Valley : లోయలో పడిపోయిన మినీ బస్సు.. 8 మంది మృతి

Bus Falls Into Valley

Bus Falls Into Valley

Bus Falls Into Valley : ఘోర ప్రమాదం జరిగింది.. 

పర్యాటకుల బృందంతో వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. 

దీంతో 8 మంది మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

Also read : Go First Flights: జూలై 30 వరకు గో ఫస్ట్ విమానాలు రద్దు..!

ఈ ఘటన పాకిస్తాన్ ఉత్తర గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలోని బాబుసార్ పాస్ సమీపంలో ఉన్న గిట్టిదాస్ ఏరియాలో చోటుచేసుకుంది. ఈ మినీ బస్సు టూరిస్టులతో పాక్ లోని మన్సెహ్రా సిటీ నుంచి గిల్గిట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులోని టూరిస్టులు అందరూ పంజాబ్‌లోని సాహివాల్ జిల్లాకు చెందినవారని గుర్తించారు. డ్రైవర్ వాహనంపై అకస్మాత్తుగా అదుపు కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. లోయలోకి మినీ బస్సు పడిపోగానే(Bus Falls Into Valley).. దానిలోని డీజిల్ లీకై పేలుడు సంభవించింది. దీంతో దానికి మంటలు అంటుకున్నాయి. కాలిన గాయాలతో 8 మంది ప్రాణాలు విడిచారు. గాయపడిన 9 మందిలో ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉంది. మిగిలిన నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Also read : TET Notification : వారంలో టెట్‌ నోటిఫికేషన్‌.. ఆ 2.20 లక్షల మందికి ఛాన్స్