Train Fire: మధురైలో ఘోర రైలు ప్రమాదం.. 8 మంది మృతి

తమిళనాడులోని మధురై (Madurai)లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్కీపూర్‌కు చెందిన లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో మధురై సమీపంలో మంటలు (Train Fire) చేలరేగాయి.

Published By: HashtagU Telugu Desk
Coach Catches Fire

Compressjpeg.online 1280x720 Image 11zon

Train Fire: తమిళనాడులోని మధురై (Madurai)లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్కీపూర్‌కు చెందిన లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో మధురై సమీపంలో మంటలు (Train Fire) చేలరేగాయి. ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న ఎనిమిది మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న ఈ రైలు రెండు కోచ్‌లలో ఒక్కసారిగా మంటలు ఆకస్మాత్తుగా వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు. మధురై స్టేషన్‌లో రైలు ఆగి ఉండగా మంటలు చెలరేగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: India squad: ఆసియా క్రీడల కోసం భారత్ నుంచి 634 మంది ఆటగాళ్లు

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రైలు చివరి రెండు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 15 రోజుల ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్నో నుంచి వచ్చిన రైలు మధురైలో ఆగడంతో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు రైలులోని పర్యాటకులు తెల్లవారుజామున సిలిండర్‌తో వంట చేస్తుండగా సిలిండర్‌ లీక్‌ అయి పేలి మంటలు చెలరేగిందని పలువురు అంటున్నారు. ప్రమాద సమయంలో రైలులో 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.

  Last Updated: 26 Aug 2023, 09:00 AM IST