Site icon HashtagU Telugu

Guinness World Record: గుండెకు మూడు సర్జరీలు.. అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు?

Guinness World Record

Guinness World Record

తాజాగా బ్రిటన్ కు చెందిన ఒక వ్యక్తి అరుదైన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. గుండెకు మూడు సార్లు బైపాస్‌ సర్జరీలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డు లో స్థానం సంపాధించారు బ్రిటన్‌కు చెందిన 77 ఏళ్ల కోలిన్‌ హాంకాక్‌ ఈ క్రమంలో పాత రికార్డును ఆయన బద్దలు కొట్టారు. వంశపారపర్యంగా సంక్రమించే హైపర్‌ కొలెస్టెరోలేమియా అనే సమస్యతో కోలిన్‌ బాధపడుతున్నారు. ఇది శరీరంలో కొవ్వులు పెరగడంతో పాటు కరోనరీ హార్ట్‌ డిసీజ్‌కు కారణమవుతుంది.

అయితే దీని వల్ల 30 ఏళ్ల వయసులో అతడికి గుండె పోటు వచ్చింది. ఆ తర్వాత ఏడాదిలో మూడు సార్లు బైపాస్‌ శస్ర్త చికిత్సలు చేశారు. అతడు ఈ సర్జరీలు చేయించుకుని 45 సంవత్సరాల 361 రోజులు గడించింది. ఈ కాలంలో ఆయనకు మరో శస్ర్త చికిత్స జరగలేదు. ఇప్పటికీ కోలిన్‌ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం పొందారు. గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన డెల్బర్ట్ డేల్ మెక్‌బీ పేరిట ఉంది. ఆయన ట్రిపుల్‌ బైపాస్‌ సర్జరీ చేయించుకుని 41 ఏళ్ల 63 రోజులు జీవించారు. 2015లో తన 90 ఏటా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కోలిన్‌ ఈ రికార్డును బద్దలు కొట్టారు.

ఈ సందర్భంగా ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ.. 30 ఏళ్ల వయసులో నేను పలు క్రీడల్లో పాల్గొనేవాడిని, ఆ సమయంలో నాకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు అని కోలిన్‌ తెలిపారు. అయితే, తన చిన్నతనంలో ఆరోగ్యం కోసం మంచి ఆహారం కూడా తీసుకోలేదని వెల్లడించారు. గుడ్లు, చిప్స్‌ ఇష్టంగా తినేవాడిని అని చెప్పుకొచ్చారు కోలిన్.