75 Years Separation: 75ఏళ్ల తర్వాత సోదరులను కలుసుకున్న సోదరి…భావోద్వేగానికి లోనైన నెటిజన్లు.!!

అమ్మనాన్నల తర్వాత మనం ప్రేమ పంచుకునేది తోబుట్టువులతోనే. తోబుట్టువులు దూరంగా ఉంటే మనం తట్టుకోలేం.

  • Written By:
  • Publish Date - May 19, 2022 / 12:08 PM IST

అమ్మనాన్నల తర్వాత మనం ప్రేమ పంచుకునేది తోబుట్టువులతోనే. తోబుట్టువులు దూరంగా ఉంటే మనం తట్టుకోలేం. కానీ 75 సంవత్సరాలుగా తోబుట్టువులకు దూరంగా ఉంటోంది సోదరి. వారు విడిపోవడానికి దేశవిభజనే కారణం. చివరకు 75సంవత్సరాల తర్వాత మళ్లీ…ఒకరినొకరు కలుసుకున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని కర్తార్ పూర్ లో తమ సోదరులను కలుసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఒక సిక్కు కుటుంబంలో జన్మించిన ముంతాజ్ బీబీ…దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో తన తల్లిని కోల్పోయింది. తల్లి మృతదేహంపై పడి ఉన్న పసిపాప అని డాన్ వార్తపత్రిక ప్రచురించింది. ఈ వార్త చూసిన ముహమ్మద్ ఇక్బాల్ ఆయన భార్య అల్లా రాఖీ…ఆపాపను దత్తత తీసుకున్నారు. సొంత కూతురిలా పెంచారు. ఆమెకు ముంతాజ్ బీబీ అని పేరు పెట్టారు. దేశ విభజన తర్వాత ఇక్బాల్ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని షేఖుపురా జిల్లాలోని వారికా తియాన్ అనే గ్రామంలో స్థిరపడ్డారు. రెండు సంవత్సరాల తర్వాత ఇక్బాల్ అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు ముంతాజ్ అసలు నిజం చెప్పారు. తన అసలు కుమార్తె కాదని…సిక్కు కుటుంబానికి చెందినదని చెప్పాడు.

సోషల్ మీడియా సాయం తీసుకున్న ముంతాజ్..
ఇక్బాల్ మరణించిన తర్వాత ముంతాజ్ తన కుమారుడు ఇక్బాల్ సోషల్ మీడియా ద్వారా తన కుటుంబం కోసం వెతకడం ప్రారంభించారు. ముంతాజ్ అసలు తండ్రి పేరు,, పంజాబ్ పాటియాలా జిల్లాలోని గ్రామం వారికి తెలుసు. అయితే అక్కడి నుంచి ఆ కుటుంబం వేరే ప్రాంతానికి వెళ్లింది. సోషల్ మీడియా ద్వారా ఇరు కుటుంబాలు కలుసుకున్నాయి. ముంతాజ్ సోదరులు గురుమీత్ సింగ్, నరేంద్ర సింగ్, అమ్రీందర్ సింగ్ తోపాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కర్తార్ పూర్ లోని గురద్వారా దర్బార్ సాహిబ్ కు చేరుకున్నారు. 75 ఏళ్ల తర్వాత ముంతాజ్ తన కుటుంబ సభ్యులను కలుసుకుంది.

నెటిజన్ల స్పందన…
ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు దేశ విభజనను అతిపెద్ద తప్పిందంగా పేర్కొన్నారు. 75ఏళ్ల తర్వాత సోదరులను కలుసుకున్న ఆనందంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాయంగా ఆలింగంనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియలో వైరల్ గా మారాయి.