Site icon HashtagU Telugu

She Teams: పోకిరీలపై ‘షీ’టీమ్ గురి!

Sheteam

Sheteam

గత ఏడు వారాల్లో మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలపై 33 మంది మైనర్ బాలురు సహా 75 మందిని రాచకొండ షీ టీమ్స్ పట్టుకున్నాయి. దీంతో పాటు 11 బాల్య వివాహాలను కూడా నిలిపివేశారు. అధికారుల ప్రకారం.. గత ఏడు వారాల్లో 16 ఎఫ్‌ఐఆర్‌లు (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లు) సహా 57 కేసులు బుక్ చేయబడ్డాయి. పట్టుబడిన వారిలో 42 మంది మేజర్లు కాగా, 33 మంది మైనర్లు. అరెస్టు చేసిన వారందరికీ ఎల్‌బీ నగర్‌లోని పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కౌన్సెలర్లు, సైకాలజిస్టులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఓ ఘటనలో వనస్థలిపురానికి చెందిన బి.నాగరాజు అనే ప్లంబర్ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి వేధించినందుకు అరెస్టయ్యాడు. నాగరాజు గతంలో కూడా ఇలాంటి కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు భోంగీర్‌, చౌటుప్పల్‌, ఇబ్రహీంపట్నం, కుషాయిగూడ, వనస్థలిపురం, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల్లో చేపట్టిన డెకాయ్‌ ఆపరేషన్లలో పలువురు పట్టుబడ్డారు. షీ టీమ్స్ మెట్రో రైళ్లలో డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి, లేడీస్ కంపార్ట్ మెంట్‌లోకి చొరబడిన 12 మంది పట్టుకున్నారు. ఈ క్రమంలో భోంగీర్‌, చౌటుప్పల్‌, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్‌లో 12 బాల్య వివాహాలను షీ టీమ్స్‌ నిలిపివేసింది. బాల్య వివాహాలపై డయల్ 100 సౌకర్యం లేదా రాచకొండ పోలీస్ వాట్సాప్ నంబర్ – 9490617111లో ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీసులు ప్రజలను కోరుతున్నారు.