COVID-19: చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా..

దేశంలో కోవిడ్ టెన్షన్ మొదలైంది. రోజురోజుకి చాపకింద నీరులా విస్తరిస్తుంది. 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 7 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం ప్రజల్ని అలెర్ట్ చేసింది. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Symptoms Difference

Symptoms Difference

COVID-19: దేశంలో కోవిడ్ టెన్షన్ మొదలైంది. రోజురోజుకి చాపకింద నీరులా విస్తరిస్తుంది. 24 గంటల్లోనే దేశంలో కొత్తగా 7 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్రం ప్రజల్ని అలెర్ట్ చేసింది. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తుంది.

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 7171 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 51,314కి చేరింది. గత 24 గంటల్లో రికవరీ రేటు 98.70 శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టడం ఉపశమనం కలిగించే విషయమే. నిన్న అంటే శుక్రవారం 7,533 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం… ఇప్పటివరకు మొత్తం 4,43,56,693 మంది కొవిడ్ పేషేంట్స్ నయమయ్యారు. తాజాగా సంభవించిన 40 మరణాలతో దేశంలో మరణాల సంఖ్య 5,31,508కి చేరింది. ఉదయం 8 గంటల డేటా ప్రకారం కేరళలో 15 మంది రోగులు మరణించారు. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లుగా నమోదైంది.

జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 0.11 వద్ద నమోదయ్యాయి, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రచారం కింద దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు.

Read More: Heavy Rains : హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ముంచెత్తిన భారీ వ‌ర్షం.. నీట‌మునిగిన ప‌లు ప్రాంతాలు

  Last Updated: 29 Apr 2023, 12:12 PM IST