7 symptoms: మహిళలూ ఈ ఏడు లక్షణాలను అస్సలు విస్మరించకూడదు…!

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి ఎంతోమంది అమాయకుల జీవితాలను నాశనం చేస్తోంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - February 3, 2022 / 06:30 AM IST

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి ఎంతోమంది అమాయకుల జీవితాలను నాశనం చేస్తోంది. దీని బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రారంభంలోనే క్యాన్సర్ లక్షణాలు గుర్తించకపోవడం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే త్వరగా కోలుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడతారు. ఇందులో గర్బాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ తో ఎక్కువమంది మహిళలు బాధపడుతుంటారు. ముఖ్యంగా మహిళలు తమలోని ఈ ఏడు లక్షణాలు గ్రహించినట్లయితే వాటిని విస్మరించకూడదు. ఆ ఏడు లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

రొమ్ము క్యాన్సర్: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణమైనది. ప్రతి ఏడాది 2.1 మిలియన్ల మంది మహిళలు దీని బారిన పడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. రొమ్ములో ఆకస్మిక మార్పులు సంభవించడాన్ని అశ్రద్ధ చేయకూడదు. అది రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రారంభ దశ కావొచ్చు. అలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతేకాదు రొమ్ము, చంకలో నొప్పిలేని గడ్డలు ఏర్పడుతుంటాయి. రొమ్ము చర్మంపై మార్పులు వస్తుంటాయి. చనుమొనల నుంచి రక్తస్రావం అవుతుంటుంది.

మెనోపాజ్ తర్వాత రక్తస్రావం: ఒక ఏడాది కాలం పాటు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం జరిగితే…ఇది గర్భాశయ క్యాన్సర్ లక్షణం కావొచ్చు. ఈ లక్షణాన్ని అస్సలు అశ్రద్ధ వహించవద్దు. గైనకాలజిస్టును సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

పీరియడ్స్ సమయంలో నొప్పి: డిస్మెనోరియా, బాధాకరమైన పీరియడ్స్ కొన్ని సమయాల్లో గర్భాశయ క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు. అయితే ఇది తరచుగా రక్తస్రావం అవ్వడం వల్లే కూడా నొప్పి వస్తుంటుంది.

ఎక్కువ కాలం రక్తస్త్రావం అవడం: ఒక వారం లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు రక్తస్రావం, ముందటి సైకిల్స్ తో పోల్చితే అధిక రక్తస్రావం వంటి సమస్యలు వచ్చినట్లయితే గైనకాలజిస్టును సంప్రదించడం మంచిది.

క్రమరహిత రక్తస్రావం: లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం, పీరియడ్స్ ముగిసన తర్వాత రక్తస్రావం కావడం…గర్భాశయ క్యాన్సర్ కు సూచిక.

దర్వాసన: యోని ఇన్ఫెక్షన్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దుర్వాసనతో కూడిన యోని ఉత్సర్గ క్యాన్సర్ కారణం అవుతుంది. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయరాదు.

ఉదర సమస్యలు: కడుపు ఉబ్బరంగా అనిపించడం, బరువు క్షీణించడం వంటి లక్షణాలు అండాశయ క్యాన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు.

ఆరోగ్యంగా ఉండాలంటే: లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. వ్యాయాయం తప్పకుండా చేయాలి. ధూమపానంకు దూరంగా ఉండాలి. ఆల్కాహాల్ సేవించరాదు. హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ ద్వారా స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముందుగా క్యాన్సర్ లక్షణాలను గుర్తించినట్లయితే చికిత్స చాలా సులభం అవుతుంది.