Summer Tips: ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడే 7 చిట్కాలు..!!!

కాలమేదైనా సరే చర్మానికి సరైన పోషణ, సంరక్షణ అనేది చాలా అవసరం. ముఖ్యంగా వేసవికాలంలో ఉక్కపోత, చెమట కారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మొటిమలు ఏర్పడతాయి.

  • Written By:
  • Publish Date - April 14, 2022 / 12:56 PM IST

కాలమేదైనా సరే చర్మానికి సరైన పోషణ, సంరక్షణ అనేది చాలా అవసరం. ముఖ్యంగా వేసవికాలంలో ఉక్కపోత, చెమట కారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మొటిమలు ఏర్పడతాయి. వాటిని నుంచి బయటపడేందుకు ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల లోషన్లు, క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే తరచుగా చర్మానికి ఈ లోషన్లను అప్లై చేసినట్లయితే..చర్మాన్ని ఎండవేడిమి నుంచి సంరక్షించుకోవచ్చు. మీరు ముఖంతోపాటు శరీరాన్ని కూడా రీఫ్రెష్ గా ఉంచుకోవాలంటే…కచ్చితమైన లోషన్ల ఎంపిక అనేది చాలా అవసరం. అవి సహజసిద్ధంగా తయారు చేసినవి అయితే…వేసవిలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే ఈ ఎండా కాలంలో మీ ముఖంతోపాటు శరీరం కూడా ఫ్రెష్ గా ఉండాలంటే ఈ బ్యూటీ కేర్ ఎసెన్షియల్స్ గురించి తెలుసుకోవాల్సిందే.

1. రోజ్ షవర్ జెల్:
నిజానికి చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అయితే ఈ కాలంలో రోజంతా తాజాగా ఉంటేనే మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ప్లమ్ బాడీ లవిన్ నుంచి తయారు చేసిన రోజ్ బాడీ వాష్ ఉపయోగించినట్లయితే మన శరీరం రోజంతా తాజాగా ఉంటుంది. ఈ జెల్ సల్ఫేట్ రహితంగా ఉంటుంది. రోజంతా రోజా పూల సువాసనతో మిమ్మల్ని మరింత తాజాగా ఉంచేలా చేస్తుంది. అంతేకాదు ఇది మీ చర్మానికి అధిక పోషణతోపాటు హైడ్రేటెడ్ గా ఉంచేలా సాయపడుతుంది.

2. కాఫీ బాడీ స్క్రబ్:
చర్మానికి ఎక్స్ ఫోలియేసన్ అనేది చాలా అవసరం. అంతేకాదు మీ చర్మానికి బూస్ట్ ఇవ్వడానికి కాఫీ స్క్రబ్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ బాడీ స్క్రబ్ కాఫ్ ఎక్స్ ట్రాక్ట్ లో చర్మాన్ని తాజాగా ఉంచే ఎన్నో గుణాలు ఉన్నాయి. డెడ్ స్కిన్ ను వదిలించుకోవానికి ఈ స్క్రబ్ అత్యత్తమంగా పనిచేస్తుంది. అంతేకాదు చర్మాన్ని రీఫ్రెష్ చేస్తుంది. అందమైన, మృదువైన చర్మాన్ని అందిస్తుంది.

3. నెక్ బ్యాక్ క్రీమ్:
ఈ నెక్ అండ్ బ్యాక్ క్రీమ్ చర్మాన్ని కాంతివంతంగా ఉంచేలా చేస్తుంది. హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ట్యాన్, ర్యాషెస్ నుంచి కాపాడుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్లు ఈ క్రీమ్ ను తరచుగా ఉపయోగించినట్లయితే తేమగా మారుతుంది. అంతేకాదు మీ ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

4. ఆకుపచ్చ, గోధుమ రంగు బాడీ లోషన్:
పూర్తిగా సహాజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఈ ఆకుపచ్చ, లేత గోధుమ రంగు బాడీ లోషన్ మీ చర్మానికి పోషణతో పాటు మృదువుగా చేస్తుంది. అంతేకాదు చర్మానికి తేమను అందిస్తుంది. చర్మం ఆరోగ్యంగా కనిపించేందుకు ఈ లోషన్ పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఈ జెల్ ను కలబంద, బాదం ఆయిల్, జోజోబా ఆయిల్, విటమిన్ ఈ వంటి పదార్థాలతో ఈ జెల్ నింబడి ఉంటుంది. ఇది మీ చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది.

5. ఆర్గాన్ ఆయిల్ షవర్ జెల్:
ఈ ఆర్గాన్ ఆయిల్ షవర్ జెల్ చర్మానికి చాలా అవసరం. ఈ షవర్ జెల్ ఆర్గాన్ ఆయిల్ శరీరాన్ని సువాసనతో నింపేస్తుంది. అంతేకాదు చర్మాన్ని మృదువుగా ఉంచండలోనూ సహాయపడుతుంది.

6. అశ్వగంధ, దాల్చిన చెక్క జెల్:
మన చర్మానికి సహజసిద్ధంగా తయారు చేసినవాటినే ఉపయోగించడం మంచిది. మంత్ర హెర్బల్ నుంచి ఈ బాడీ వాష్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో వస్తుంది. ఇది చర్మాన్ని సున్నితమైన క్లైన్సింగ్ ను అందిస్తుంది. దీంతో మీ చర్మం మృదువుగా మారుతుది. ఈ బాడీ వాష్ ను అశ్వగంధ, దాల్చిన చెక్కతో సహజ సిద్ధంగా తయారు చేశారు.

7. దోసకాయ, కలబంద ఫోమింగ్ బాడీ వాష్
వేసవిలో మనకు ఈ బాడీ వాష్ చాలా అవసరం. కలబంద, దోసకాయ, పుచ్చకాయ వంటి పదార్థాలతో సహజసిద్ధంగా తయారు చేసిన ఈ బాడీ వాష్…చర్మాన్ని రిఫ్రెష్ చేయడంతోపాటు బూస్ట్ ను అందిస్తుంది. ఈ బాడీ వాష్ కచ్చితంగా మన బ్యూటీ షెల్ఫ్ లో ఉండాల్సిందే. ఇందులో ఉండే గుణాలు మన చర్మాన్ని పూర్తిగా శుభ్రంగా ఉంచడంతోపాటు…మృదువుగా ఉంచుతుంది.