Site icon HashtagU Telugu

7 Killed : పుణేలో విషాదం.. న‌దిలో దూకి ఏడుగురు ఆత్మ‌హ‌త్య‌.. ?

Deaths

Deaths

మహారాష్ట్రలోని పూణేలో విషాదం చోటుచేసుకుంది. నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మూడు రోజుల వ్యవధిలో ఒకే నదిలోని వివిధ ప్రాంతాల్లో మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఎస్పీ ఆనంద్ భాటే తెలిపిన వివరాల ప్రకారం పూణెలోని దౌండ్‌లోని భీమా నదిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. పూణే శివార్లలోని అహ్మద్‌నగర్‌లో కనీసం ఏడుగురు తప్పిపోయినట్లు మంగళవారం పోలీసులకు సమాచారం అందింది. కాల్ వివరాలను పరిశీలించిన పోలీసులు.. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని తేల్చారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. వీరి కుటుంబ సభ్యులలో ఒకరు వివాహిత బంధువుతో సంబంధం కలిగి ఉన్నారు. అయితే ఆ వ్యక్తి పారిపోయి.. తిరిగి రాలేదు. అవమానం తట్టుకోలేక కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version