Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఒడిశా (Odisha)లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్‌పుర్‌ జిల్లాలోని ధర్మశాల పీఎస్‌ పరిధిలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.

  • Written By:
  • Publish Date - February 25, 2023 / 10:56 AM IST

ఒడిశా (Odisha)లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్‌పుర్‌ జిల్లాలోని ధర్మశాల పీఎస్‌ పరిధిలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ధటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా బెంగాల్‌కు చెందినవారిగా గుర్తించారు.

జాజ్‌పూర్ జిల్లాలోని న్యూల్‌పూర్ వద్ద సెంట్రల్ బ్యాంక్ సమీపంలో జాతీయ రహదారి-16పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. నివేదికల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ వైపు నుండి వస్తున్న వాహనం (మినీ ట్రక్) ట్రక్కును ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన ఏడుగురూ కోల్‌కతా వాసులే. వీరు పశ్చిమ బెంగాల్ నుంచి ట్రక్కులో వస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే చాందీ ఖోల్ అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధర్మశాల పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: AndhraPradesh: ఏపీలో దారుణం.. వ్యక్తిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి హత్య

నివేదికల ప్రకారం.. శుక్రవారం జాతీయ రహదారి 16పై న్యూలాపూర్ వద్ద రెండు ట్రక్కులు ఢీకొని మంటలు చెలరేగాయి. దీని కారణంగా ట్రక్కు దగ్ధమై రోడ్డుపై పడి ఉంది. మరుసటి రోజు అంటే శనివారం (నేడు) పశ్చిమ బెంగాల్ నుండి కోళ్లను తీసుకువెళుతున్న ఐచర్ ట్రక్ తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న కాలిన ట్రక్కును ఢీకొట్టడంతో 7 మంది మరణించారు. మృతదేహాలను ధర్మశాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఉంచారు. ప్రస్తుతానికి, ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.