Site icon HashtagU Telugu

Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి

Patna News

Patna News

Patna News: బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..

బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. క్రేన్‌ను ఆటో రిక్షా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో దాదాపు ఏడుగురు మరణించారు. సమాచారం ప్రకారం కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బైపాస్‌లోని రామ్‌లాఖన్ పాత్ మలుపు దగ్గర క్రేన్ ఆటోను ఢీకొట్టింది . ఆటోలో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదంలో మామ, కోడలు, మనవడు సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు

ఆటో రిక్షా మిఠాపూర్ నుండి జీరో మైల్ వైపు వెళ్తుండగా, మెట్రో నిర్మాణ పనుల్లో నిమగ్నమైన క్రేన్‌ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. తెల్లవారుజామున 3:44 గంటలకు మెట్రో బైపాస్‌లో క్రేన్‌తో పాట్నా మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంతలో పాత బస్టాండ్‌ నుంచి వస్తున్న ఆటో రిక్షా క్రేన్‌ను ఢీకొట్టింది. అయితే ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు రోడ్డును దిగ్బంధించారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పాట్నా మెట్రో పనివేళల్లో క్రేన్ చుట్టూ గార్డు లేడు. ఘటన జరిగిన తర్వాత ఎవరికీ సమాచారం ఇవ్వకుండా క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి క్రేన్‌తో పరారయ్యాడని సమాచారం.

We’re now on WhatsAppClick to Join

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా క్రేన్‌ మెట్రో పనులు చేస్తున్నట్లు కనిపించింది. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా అందిన సమాచారం మేరకు మృతుల పేర్లు ఇలా ఉన్నాయి. పింకీ సరన్ (28), అభినందన్ (5) మోతీహరి జిల్లాలోని సెమ్రా సకర్దిరా నివాసితులు. లక్ష్మణ్ దాస్ నేపాల్‌లోని జలేసర్ ధామ్ నివాసి. ఉపేంద్ర కుమార్ బైతా(38) స్వస్థలం రోహ్తాస్ జిల్లా ప్రేమ్‌పూర్ పటారి. మృతుల్లో మరో ముగ్గురి వివరాలు ఇంకా తెలియరాలేదు.ప్రస్తుతం ఆటో డ్రైవర్ కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం.

Also Read: Maoist Party : ఇంద్రవెల్లి పోరాటాన్ని స్మరించుకుంటూ మావోయిస్టుల లేఖ

Exit mobile version