7 India Syrups : 7 ఇండియా సిరప్ లు డేంజర్ : డబ్ల్యూహెచ్వో

7 India Syrups : ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మంది మరణాలకు కారణమైన 20 హానికారక మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.ఇవన్నీ ఇండియా, ఇండోనేషియా దేశాలలోని 15 వేర్వేరు కంపెనీల్లో తయారైనవే.. 

  • Written By:
  • Updated On - June 20, 2023 / 11:45 AM IST

7 India Syrups :  దాదాపు 300 మంది మరణాలకు కారణమైన 20 హానికారక మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. 

ఇవన్నీ ఇండియా, ఇండోనేషియా దేశాలలోని 15 వేర్వేరు కంపెనీల్లో తయారైనవే..

ప్రత్యేకించి ఈ 20 డేంజరస్ సిరప్ లలో 7 సిరప్ లు మన ఇండియాలోనే తయారయ్యాయి.   

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన  20 హానికర మందుల్లో దగ్గు మందులు, పారాసెటమాల్, విటమిన్లకు సంబంధించిన సిరప్ లు ఉన్నాయి.  మన దేశంలో తయారవుతున్న 7 హానికారక సిరప్ లలో(7 India Syrups)..  4 హర్యానాలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లో,  నోయిడాలోని మారియన్ బయోటెక్ లో 2 సిరప్ లు, పంజాబ్‌ లోని QP ఫార్మాకెమ్ లో 1 సిరప్ తయారయ్యాయి. మిగిలిన సిరప్ లు అన్నీ ఇండోనేషియాలో తయారయ్యాయి.15 సిరప్ ల వినియోగంపై గాంబియా, ఉజ్బెకిస్తాన్‌ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే  అలర్ట్ చేసింది.

Also read : 18 Kids Died: ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు సిరప్ తాగి 18 మంది మృతి

ఇండియాలో తయారైన కొన్ని సిరప్ ల వల్ల ఆ రెండు దేశాలతో పాటు మైక్రోనేషియా, మార్షల్ దీవులలో 88 మంది చనిపోయారని గతంలో WHO ప్రకటించింది. ఇండోనేషియాలోనూ ఈ హానికర సిరప్ లు తాగి 200 కంటే ఎక్కువ మంది పిల్లలు చనిపోయారని పేర్కొంది. ముంబైకి చెందిన ఒక  కంపెనీ లైబీరియాలో విక్రయించే పారాసెటమాల్ సిరప్‌ డైథైలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ గ్లైకాల్‌ తో కలుషితమైందని  తేలింది. దీంతో ఆ సిరప్ ను వాడొద్దంటూ నైజీరియన్ డ్రగ్ కంట్రోలర్ హెచ్చరికను జారీ చేసింది.