Telangana: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ అమలు చేసింది. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా పార్టీలు డబ్బులు, మద్యం వెదజల్లుతుంటాయి. అక్రమ డబ్బు, మాదకద్రవ్యాలు, మద్యం లాంటి ప్రలోభాలకు వ్యతిరేకంగా హైదరాబాద్ సిటీ పోలీసులు నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.
అక్టోబరు 9 నుండి ఇప్పటి వరకు పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం: 7.706 కిలోగ్రాములు, విలువ 42 కోట్లు (10 గ్రాములకు 55,000/- చొప్పున). వెండి: 11.700 కిలోగ్రాములు. విలువ 8.77 లక్షలు (కిలోగ్రాముకు 75,000/ గా అంచనా). నగదు : రూ. 5.1 కోట్లు. అలాగే మద్యం: 110 లీటర్లు. డ్రగ్స్: 2 కిలోల గంజాయి. మొబైల్ ఫోన్లు :23. PDS బియ్యం:43 క్వింటాళ్లు.
Also Read: Arundhati Roy : అరుంధతీ రాయ్ ని అరెస్టు చేస్తారా ?